Header Banner

నంద్యాల జిల్లాలో విషాదం! ఇంటర్ ఫెయిల్ అయ్యాడని విద్యార్ధి ఆత్మహత్య !

  Sat Apr 12, 2025 20:42        Others

నేడు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ఇంటర్ పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడన్న మనస్తాపంతో చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న అతను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. చిన్న మస్తాన్ తండ్రి పెద్ద మస్తాన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 

ఈ ఘటన మరోసారి చదువు పట్ల మన దృక్పథాన్ని పునర్‌మూల్యాంకనం చేసుకునే అవసరాన్ని గుర్తు చేస్తోంది. చదువు అనేది కేవలం మార్కులు సాధించడానికే కాదు, ఆలోచనాశక్తి, జ్ఞానం పెంపొందించుకోవడానికీ మార్గం. ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యిందని జీవితాన్ని విస్మరించకూడదు. జీవితమే ఓ పరీక్ష అయితే, ఒక్క ఫెయిల్యూర్‌తో మన ఫలితం నిర్ణయించబడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ మరో అవకాశం కోసం ప్రయత్నించాలి. చదువు లేకపోయినా విజయాలందుకున్న అనేకమంది ఉన్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తాయి కాబట్టి, ఎప్పుడూ నిశ్చలంగా, ధైర్యంగా ముందుకెళ్లడం ముఖ్యం.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #StudentMentalHealth #ExamStress #DontGiveUp #YouAreNotAlone #MentalHealthMatters #InterResults2025